దేదివ్యమానంగా సాగుతున్న యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు.. నేటితో ముగియనున్నాయి. శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు, మహపూర్ణాహుతి, చక్రతీర్థం తతంగాలను నిర్వహించారు. రాత్రి సకల దేవతలకు వీడ్కోలు ఉత్సవాన్ని చేపట్టారు. శ్రీ లక్ష్మీ నారసింహులకు పుష్పయాగం నిర్వహించారు. స్వామి వారి దివ్యాయుధమైన సుదర్శన చక్రానికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం గుట్టపై ఉన్న విష్ణుపుష్కరిణిలో చక్రతీర్థ కార్యక్రమం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు, నామ సంకీర్తనలతో.. ఆగమ శాస్త్రోక్తంగా ఉత్సవం సాగింది.
తుది దశకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు - యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
పదకొండు రోజులు పాటు అత్యంత వైభవంగా సాగిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. శుక్రవారం రాత్రి సకలదేవతలకు వీడ్కోలు పర్వాన్ని ఘనంగా నిర్వహించారు. నేటి ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
తుది దశకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలోని మూలవరులకు ఇవాళ శతఘటాభిషేకం నిర్వహిస్తారు. 108 కలశాల నీటితో స్వామికి పూజలు నిర్వహిస్తారు. ఆ నీటిని ప్రధాన కలశంలోనికి తీసుకుని గర్భాలయంలోని మూలమూర్తులకు అభిషేకం నిర్వహించే కార్యక్రమంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఇవీ చూడండి:20 వరకు బడ్జెట్ సమావేశాలు.. 8న పద్దు
Last Updated : Mar 7, 2020, 6:39 AM IST