యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 6 వరకు జరగనున్న ఈ ఉత్సవాలు... ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవాచనంతో ఘనంగా మొదలయ్యాయి. లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండానే, ఏకాంత సేవలో నిరాడంబరంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజున తిరువెంకటపతి అలంకారంలో స్వామి వారు కనువిందు చేశారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి వేడుకలు ప్రారంభం - యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు ప్రారంభం
యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 6 వరకు వేడుకలు నిర్వహించనున్నారు. లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండానే ఏకాంత సేవలో నిరాడంబరంగా జరుపుతున్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహుడి జయంతి వేడుకలు ప్రారంభం
స్వస్తివాచనంతో జయంతి ఉత్సవాలు శాస్త్రోత్తంగా ప్రారంభించిన అర్చకులు, స్వామివారికి లక్షపుష్పార్చన చేశారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, రక్షాబంధనం నిర్వహించారు. రేపు కాళీయమర్థని అవతారం, రామావతారంలో అలంకరించి లక్ష కుంకుమార్చన చేయనున్నారు. చివరి రోజున సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలు ముగియనున్నాయి. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వలస కార్మికుల రైల్ టికెట్‌పై రాజకీయ రగడ