తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటితో యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

యాదాద్రీశుడి బ్రహ్మోత్సావాలు నేటితో ముగియనున్నాయి. 11 రోజుల పాటు విశిష్ట సేవలు అందుకున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలు నేటి రాత్రి జరగనున్న డోలోత్సవ కార్యక్రమంతో ముగియనున్నాయి.

yadadri lakshminarasimhaswami bramhostav finished this day in yadadri bhuvanagiri
నేటితో యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి

By

Published : Mar 7, 2020, 6:00 PM IST

Updated : Mar 7, 2020, 6:06 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. ఫిబ్రవరి 26 నుంచి 11రోజుల పాటు జరిగిన యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు ఈరోజు రాత్రికి డోలోత్సవం నిర్వహించి ముగింపు పలకనున్నారు. మధ్యాహ్నం అష్టోత్తర శతఘటాభిషేకం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా ముగించారు.

బాలాలయంలో 108 కలశాలను వరుసగా పేర్చి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల హోరు నడుమ కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశాలల్లోని జలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్లను గర్భాలయంలోకి తీసుకెళ్లారు.

నేటితో యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి

ఇదీ చూడండి:విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణతోనే దేశరక్షణ!

Last Updated : Mar 7, 2020, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details