తెలంగాణ

telangana

ETV Bharat / state

యాలీ స్థూపాలు, సింహ రూపాలతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయం - yadadri bhuvanagiri district

దైవచింతనతో వచ్చే భక్తులకు ఆహ్లాదం కలిగించేలా యాదాద్రీశుడి ఆలయం ఆవిష్కృతమవుతోంది. భక్తులు కొంగుబంగారంగా కొలుస్తున్న పంచనారసింహుల ప్రాంగణంలోని అష్టభుజ మండప ప్రాకారంలో లోపలివైపు యాలీ స్థూపాలు, సింహ రూపాలు కనువిందు చేస్తున్నాయి.

yadadri lakshmi narasimha swamy temple
యాదాద్రి ఆలయం

By

Published : Oct 2, 2020, 9:42 AM IST

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పనులు తుదిదశకు చేరుకున్నాయి. భక్తులు కొంగుబంగారంగా కొలిచే పంచనారసింహుల దివ్యక్షేత్రంలోని అష్టభుజ మండప ప్రాకారంలో లోపలివైపు యాలీ స్థూపాలు, సింహ రూపాలు కనువిందు చేస్తున్నాయి. ఆలయం చుట్టూ నిర్మితమైన పద్మం ఆకారంలో ఉన్న స్థూపాలు స్వామివారి వైభవాన్ని చాటుతున్నాయి.

యాలీ స్థూపాలతో యాదాద్రి ఆలయం

వివిధ శిల్ప రూపాలమయంగా రూపుదిద్దుకుంటున్న స్తంభోద్భవుడి సన్నిధి భక్తులను అలరించడానికి సన్నద్ధమవుతోంది. పంచనారసింహ స్వామిని దర్శించుకుని పారవశ్యంలో మునిగిపోయేందుకు వచ్చే భక్తులకు ఆహ్లాదం, ప్రశాంతతం కలిగించేలా యాదాద్రీశుడి కోవెల రూపుదిద్దుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details