తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri temple renovation : యాదాద్రికి ఐరావతాలు.. అద్దాల మండపానికి బిగించేందుకు సన్నాహాలు

తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యేక్షేత్రం యాదాద్రి ఆలయ(Yadadri temple renovation) పునర్నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా.. అధునాతన హంగులతో నిర్మిస్తోన్న ఈ ఆలయంలో అద్దాల మండపానికి ఐరావతం శిల్పాలను బిగించనున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కృష్ణశిలతో రూపొందించిన ఈ శిల్పాలు యాదాద్రి(Yadadri temple renovation)కి చేరాయి.

యాదాద్రికి ఐరావతాలు
యాదాద్రికి ఐరావతాలు

By

Published : Sep 23, 2021, 11:05 AM IST

తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం(Yadadri temple renovation) పునర్నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. అటు ఆధ్యాత్మికత.. ఇటు ఆధునికతను జోడించి నిర్మిస్తోన్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం(Yadadri temple renovation) రాష్ట్రానికే వైభవాన్ని తీసుకురానుంది. అధునాతన హంగులతో నిర్మిస్తోన్న అద్దాల మండపానికి ఐరావతం శిల్పాలను బిగించనున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కృష్ణశిలతో రూపొందించిన ఈ విగ్రహాలు యాదాద్రికి చేరాయి.

అద్దాల మండపం
అద్దాల మండపం

మహావిష్ణువు అలంకార ప్రియుడు. వివిధ రూపాలతో రూపొందిన అష్టభుజ మండప ప్రాకారంలో సిద్ధమవుతున్న అద్దాల మండప ద్వారానికి ఇత్తడి కవచాలతో 12 మంది ఆళ్వారుల ప్రతిమలను బిగించారు. ద్వారానికి ఇరువైపుల సుమారు మూడడుగుల ఎత్తు కలిగిన ఐరావత విగ్రహాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. మండప సందర్శనలో భక్తులు మంత్రముగ్ధులయ్యేలా.. సీసంతో తయారైన శ్రీకృష్ణ పరమాత్మ రూపం త్వరలోనే ఆవిష్కృతం కానుంది. గోధుమ వర్ణంలో ఈ విగ్రహాలు అత్యంత సుందరంగా ఉన్నాయి.

ఐరావతాలు
ఐరావతాలు

నిత్యోత్సవాలతో భక్తులకు కనువిందు చేసే లక్ష్మీనరసింహుల కోవెల(Yadadri temple renovation) సందర్శనలో స్వామి సేవలకు ఇబ్బందులు కలగకుండా యాడా తగిన వసతులు కల్పిస్తోంది. ఆలయ(Yadadri temple renovation) ఉద్ఘాటనకు ముందుగా ఆలయాల పునర్నిర్మాణం, భక్తులకు వసతుల ఏర్పాట్లు వంటి పనులు పూర్తయ్యేలా కృషి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details