తెలంగాణ

telangana

ETV Bharat / state

yadadri Temple Updates : తుదిదశకు యాదాద్రి ఆలయ పనులు.. పునర్నిర్మాణం అప్పుడే... - yadadri temple inauguration in december

తెలంగాణలోని సుప్రసిద్ధ దేవాలయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కోవెల పునర్నిర్మాణం తుది దశకు చేరుకుంది. నవంబర్ లేదా డిసెంబర్ తొలి వారంలో పంచ నారసింహలు ఆలయ ఉద్ఘాటన జరగనున్నందున ఆలోగా పనులన్ని పూర్తి చేయడానికి కృషి యాడా అధికారులు చేస్తున్నారు. క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికుల కొండపైకి వెళ్లే ఆలయ పాత కనుమదారిని విస్తరిస్తున్నారు. వీఐపీల కోసం ఏర్పాటవుతున్న ప్రత్యేక లిఫ్ట్‌ ప్రవేశ మార్గంలో స్వాగత ద్వారానికి సంప్రదాయ హంగులను తీర్చిదిద్దుతున్నారు.

yadadri Temple Updates
yadadri Temple Updates

By

Published : Oct 11, 2021, 1:05 PM IST

స్వయంభు క్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండపైన పనుల పూర్తికి యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ(యాడా) యంత్రాంగం శ్రమిస్తోంది. నవంబరు లేదా డిసెంబరు తొలి వారంలో పంచ నారసింహుల ఆలయ ఉద్ఘాటన చేపట్టనున్న నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న కట్టడాలను రెండు నెలల్లో యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ మేరకు సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని తన ఛాంబర్‌లో పనులను సమీక్షించనున్నారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు అధికారులు తగు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

ముమ్మరంగా కనుమదారి విస్తరణ

సరికొత్తగా పడమటి దిశలోని ఆలయ రక్షణ గోడకు ఏర్పాటవుతున్న జైపుర్‌కు చెందిన ఐరావతం, స్వామి రథశాల కళాకృతులను భక్తులు సందర్శించేలా పోర్టీకో, మెట్ల దారి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ క్రమంలో బండరాతిని తొలగించే పనులను ఆదివారం చేపట్టారు.

క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికుల కొండపైకి వెళ్లే ఆలయ పాత కనుమదారిని విస్తరించే పనులు చేపడుతున్నారు. గతంలో హరిత అతిథి గృహ సముదాయం నుంచి కొండపైకి, ప్రస్తుతం జీయర్‌ కుటీరం వద్ద గల మలుపు నుంచి దారి విస్తరించే పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఆ దారిలోని మినీ పార్కునూ తొలగిస్తున్నారు. రూ.143 కోట్ల వ్యయంతో చేపట్టిన వలయ దారి నిర్మాణంలో భాగంగా ఈ విస్తరణ పనులు జరుగుతున్నాయి. కొండపైన విస్తరణకు రెండో దశలో చేపట్టిన పనులను ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్‌ ఎప్పుడైనా రావొచ్చని యాడా అధికారులు భావిస్తున్నారు. ఉత్తరాన రూ.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రక్షణ గోడ పూర్తి కావొస్తోంది. ఈ గోడ నిర్మాణంతో కొండపై ఐదెకరాల ప్రాంగణం చదునుగా మారి విస్తరణ కానుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడే బస్‌బే, వాహనాల కోసం మినీ పార్కింగ్‌ ఏర్పాట్లు జరగనున్నాయి.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం
పాతకనుమ దారి విస్తరణ
స్వాగత హంగులు

లిఫ్టునకు స్వాగత హంగులు

వీఐపీల కోసం ఏర్పాటవుతున్న ప్రత్యేక లిఫ్ట్‌ ప్రవేశ మార్గంలో స్వాగత ద్వారానికి సంప్రదాయ హంగులను తీర్చిదిద్దుతున్నారు. వైష్ణవం ఉట్టిపడేలా శంఖం, చక్రం, తిరునామాలతో సహా గరుడ ఆళ్వారుల విగ్రహాలను సిమెంటుతో రూపొందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details