యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతకలశాలను ఏర్పాటు చేసిన ఆలయ అర్చకులు.. కలశాలలోని జలాలకు పాలు, పెరుగుతో పూజలు చేశారు.
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం - యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి
లక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రీశుడి సన్నిధిలో స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
వేదమంత్రాలు, మంగ వాద్యాల నడుమ నరసింహునికి శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామి వారి అష్టోత్తర శత నామాలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది.