తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో నియంత పాలన: కోమటిరెడ్డి - compaign

యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్​ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ప్రాదేశిక ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

By

Published : May 7, 2019, 10:31 PM IST

ప్రాదేశిక ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

యాదాద్రి జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రేపటితో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగుస్తుండటం వల్ల కాంగ్రెస్ ప్రచారాన్ని వేగవంతం చేసింది. జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, ధనిక రాష్ట్రమైన తెలంగాణను తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు జలగల్లా పీక్కుతిని అప్పులపాలు చేశారని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details