యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి వారి హుండీలను ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. కార్తిక మాసం కావడంతో సాధారణ రోజుల కంటే హుండీ ఆదాయం కాస్త ఎక్కువగా వచ్చింది.
యాదాద్రి హుండీ ఆదాయం లెక్కింపు.. ఎంతొచ్చిందంటే..! - యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి హుండీ ఆదాయం
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని అధికారులు గురువారం లెక్కించారు. 23 రోజుల హుండీ ఆదాయం రూ.94,64,969 నగదుతోపాటు బంగారం, వెండి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
యాదాద్రి హుండీ ఆదాయం ఎంతో తెలుసా
నరసింహ స్వామి వారి దేవస్థానం 23 రోజుల హుండీ ఆదాయం... 94,64,969 రూపాయల నగదు, 147 గ్రాముల బంగారం, 3 కిలోల 200 గ్రాముల వెండి వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి పేర్కొన్నారు. ఈ హుండీ లెక్కింపులో కార్యక్రమంలో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఆశ్రమంలో అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం