ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో 30 రోజుల హుండి ఆదాయం లెక్కించారు. దేవస్థానం 30 రోజుల హుండీ ఆదాయం 27 లక్షల 92వేల 436 రూపాయల నగదు, నాలుగు గ్రాముల బంగారం, 620 గ్రాముల వెండి వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వాహణాధికారి గీతారెడ్డి వెల్లడించారు.
యాదాద్రి హుండీ ఆదాయం ఎంతో తెలుసా..! - యాదాద్రి ఆలయ సమాచారం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించారు. దేవస్థానం 30 రోజుల ఆదాయం 27 లక్షల 92వేల 436 రూపాయల నగదు వచ్చిందని ఆధికారులు తెలిపారు.
Yadadri hundi income calculation
ఈ హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. భౌతికదూరం పాటిస్తూ.. చేతులకు గ్లౌజులు ధరించి.. హుండీని లెక్కించారు. కరోనా వల్ల భక్తులు అధిక సంఖ్యలో రాకపోవడం వల్ల దేవస్థానం హుండీ ఆదాయం తగ్గినట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చూడండి:అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు