సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా మొదటి ఘాట్ రోడ్డు విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఉన్న పాత ఘాట్ రోడ్డు ఏడు మీటర్లు మాత్రమే ఉండేది. దాన్ని 12 మీటర్ల మేర విస్తరణ చేపడుతున్నట్లు, రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు.
మొదటి ఘాట్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం - తెంలగాణ వార్తలు
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా మొదటి ఘాట్ రోడ్డు విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో భాగంగా పాత ఘాట్ రోడ్డును విస్తరించాలని ఆదేశించారు.
![మొదటి ఘాట్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం yadadri ghat road extension works speed up](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11040075-thumbnail-3x2-nds.jpg)
మొదటి ఘాట్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం
హరిత టూరిజం నుంచి కొండపై వరకు పాత రోడ్డును సగం వరకు తొలగించి, వెడల్పు చేస్తున్నారు. గత వారం పది రోజులుగా ఈ పనులు జరుగుతున్నాయి. ఎర్ర మట్టి పోసి యంత్రాల సహాయంతో చదును చేసి రాతి గోడ కడుతున్నారు. పనులు జరుగుతున్నందున పాత ఘాట్ రోడ్డు నుంచి కొండ పైకి వాహనాలు అనుమతించడం లేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 247 కేసులు