యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బాలాలయంలో వైభవంగా జరిగిన వేడుకల్లో... శ్రీ లక్ష్మీనరసింహస్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. నేడు జరిగే కల్యాణ క్రతువులో భాగంగా... ఎదుర్కోలు వేడుక చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. నేడు స్వామి వారి కల్యాణం - యాదాద్రి జిల్లా
వధూవరుల గుణగణాలను కీర్తిస్తూ... దశావతారాల్లో నారసింహుని వైశిష్ట్యాన్ని చాటుతూ... స్వామి అమ్మవార్ల అసమాన కీర్తి ప్రతిష్ఠల్ని లోకానికి చాటిచెబుతూ సాగిన ఎదుర్కోలు ఉత్సవం.. కనుల పండువగా జరిగింది. యాదాద్రి బాలాలయంలో నిర్వహించిన వేడుక... లక్ష్మీ నృసింహుని దర్పాన్ని కళ్లకు కట్టింది. వివాహానికి ముందు చేపట్టిన క్రతువు... జనుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.
వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. నేడు స్వామి వారి కల్యాణం