యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామివారికి సంబంధించిన అధికారిక బ్యాంకు క్యూఆర్ కోడ్‌ను ఆలయ ఈఓ గీత విడుదల చేశారు. స్వామి ప్రధానాలయంలోని విమాన గోపురం బంగారు తాపడానికి ప్రజలు, స్వామి వారి భక్తులు తమ మొబైల్ ద్వారా క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి, విరాళం అందించొచ్చని ఈవో తెలిపారు. తమకు తోచిన సాయం చేసి బంగారు తాపడం నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. దాతలు బ్యాంక్‌కు నేరుగా రాకుండా ఎక్కడి వాళ్లు అక్కడే విరాళం అందజేసేందుకు బ్యాంక్ క్యూ ఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
వెల్లువెత్తుతున్న విరాళాలు..
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుడి.. ఆలయ పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ (Cm Kcr) పిలుపు మేరకు.. ఆలయ విమాన గోపురానికి బంగారుతాపడం కోసం ఇప్పటికే విరాళాలు (Gold Donation For Yadadri) వెల్లువెత్తాయి. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తమ కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం విరాళమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr Gold Donation For Yadadri) ప్రకటించారు. ఆలయ విమాన గోపురానికి భారీగా బంగారం అవసరమని సీఎం తెలిపారు. విమాన గోపురానికి 125 కిలోల బంగారం అవసరం పడుతుందని ముఖ్యమంత్రి వివరించారు. విమాన గోపురానికి దాతలు బంగారం విరాళం ఇస్తామని చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు.
వ్యాపారవేత్తల విరాళాలు..