రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. యాదాద్రి క్షేత్ర సందర్శనకు వచ్చే దేశాధినేతలు, ఇతర ప్రముఖుల బస కోసం ప్రత్యేక ప్రణాళిక ద్వారా ప్రెసిడెన్షియల్ సూట్లు నిర్మిస్తుతన్నారు. ఇందుకు గానూ.. దాతల విరాళాల ద్వారా సేకరించిన రూ.104 కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు ఆలయానికి ఉత్తర దిశలో కొండ కిందిభాగంలో ఓ చిన్నకొండపై ఒక ప్రెసిడెన్షియల్ ప్రధాన సూటు, మరో 14విల్లాల నిర్మాణాన్ని చేపట్టారు.
యాదాద్రిలో రూ.104 కోట్లతో అతిథి గృహాల నిర్మాణం - Yadadri Bhuvanagiri News
తెలంగాణలో అత్యద్భుతంగా పునర్నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. రూ.104 కోట్ల వ్యయంతో యాదాద్రి క్షేత్ర సందర్శనకు వచ్చే దేశాధినేతలు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ సూట్లు నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.
యాదాద్రిలో రూ.104 కోట్లతో అతిధి గృహాల నిర్మాణం
ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో సూట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది, సూట్ల సముదాయంలో 13విల్లాలు, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం దాదాపు కావొస్తోందని పనులను పర్యవేక్షిస్తున్న ఈఈ వసంత నాయక్, డిప్యూటీ ఈఈ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం క్షేత్రస్థాయికి తగ్గట్లు జరుగుతోందని యాడ వైస్ ఛైర్మన్ కిషన్ రావు తెలిపారు.
ఇదీ చూడండి:కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు