తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2021, 4:09 AM IST

ETV Bharat / state

రోడ్డు విస్తరణ బాధితులతో కలెక్టర్​ సమావేశం

యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణ బాధితులతో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా పాలనాధికారి, భువనగిరి ఆర్డీఓ వారితో నష్టపరిహారం విషయంపై సమావేశం జరిపారు.

yadadri Collector meeting with road widening victims at yadagirigutta
రోడ్డు విస్తరణ బాధితులతో కలెక్టర్​ సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణ బాధితులతో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా పాలనాధికారి, భువనగిరి ఆర్డీఓ వారితో నష్టపరిహారం విషయంపై చర్చించారు. యాదగిరిగుట్టలో ప్రధాన రహదారి వెంట ఉన్న ఇళ్లు, దుకాణాలు, కోల్పోతున్న బాధితులను ఆదుకుంటామని మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా తెలిపారు.

ఈ నేపథ్యంలో తమకు నష్ట పరిహారం, ప్లాట్ అలైన్​మెంట్​, గండి చెరువు పరిసర ప్రాంతంలో.. నిర్మించబోవు బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్​లో మడిగలు కేటాయించాలని బాధితులు జిల్లా కలెక్టర్​, ఆర్డీవోకు తెలిపారు. 100 ఫీట్ల రోడ్డు మాత్రమే వెడల్పు చేపట్టాలని.. 150 ఫీట్ల రోడ్డు వెడల్పు చేపడితే తమకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. తమకు సరైన నష్టపరిహారం చెల్లించి కూల్చివేత పనులు చేపట్టాలని బాధితులు కలెక్టర్​ను కోరారు. ఈ అంశం అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారితో చర్చిస్తామని కలెక్టర్ బాధితులకు తెలిపారు. ఈ సమావేశంలో యాదగిరిగుట్ట తహసీల్దార్ అశోక్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రోడ్డు బాధితులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :ఉద్యోగాల పేరుతో సైబర్​ మోసాలు.. నిందితుడి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details