యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కరోనా బారిన పడ్డారు. వైరస్ లక్షణాలు ఉండడంతో నిర్ధరణ నిమిత్తం నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపారు. కలెక్టర్‌కు పాజిటివ్‌గా తేలిందని జిల్లా వైద్యారోగ్య అధికారి వెల్లడించారు.
టీకా రెండు డోసులు తీసుకున్నా.. కరోనా బారిన పడిన కలెక్టర్ - యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్
కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నా కొందరు కొవిడ్ బారినా పడుతూనే ఉన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని... టీకా తీసుకున్నా నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా యాదాద్రి కలెక్టర్ కరోనా బారిన పడ్డారు.
టీకా రెండు డోసులు తీసుకున్నా.. కరోనా బారిన పడిన కలెక్టర్
ప్రస్తుతం అనితా రామచంద్రన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ వెల్లడించారు. కలెక్టర్ హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. అనితా రామచంద్రన్ కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా బారినపడ్డారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 3,840 కరోనా కేసులు, 9 మరణాలు