yadadri bus station: యాదాద్రి పుణ్యక్షేత్రానికి తగ్గట్లుగా ఆర్టీసీ వసతులను కల్పించే దిశగా 'యాడా' రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే వనరుల ఏర్పాట్లకై రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.
యాదాద్రి బస్ స్టేషన్ నిర్మాణ పనులు యాదాద్రిలో ఆర్టీసీ సదుపాయాలు...
క్షేత్ర సందర్శనకై వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల రాకపోకలకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా రవాణా వ్యవస్థను రూపొందించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇటీవలే నిధులను మంజూరు చేయడంతో ఆర్టీసీ బస్ స్టేషన్ పనులకు శ్రీకారం చుట్టింది. కొండకింద గండి చెరువు వద్ద కేటాయించిన 5 ఎకరాల్లో దీని నిర్మాణానికి తవ్వకాలు చేపట్టారు. చెరువు పరిసరాలు కావడంతో మెత్తటి మట్టి వస్తోందని.. గట్టి ప్రాంతం వచ్చాక పుట్టింగ్ పనులు చేపడుతామని ఆర్టీసీ ఇంజనీర్లు తెలిపారు.
కొండ పైన, కింద బస్ టెర్మినల్స్
ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణం పక్కనే దక్షిణ దిశలో బస్ టెర్మినల్‌ను నిర్మించనున్నారు. ఈ మేరకు యాడా అధికారులు సన్నద్ధమవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండపైన గల దేవస్థానానికి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక బస్ బే నిర్మితమవుతోంది. కొండ పైన దర్శన వరుసల సముదాయం వద్ద ఆలయానికి ఉత్తర దిశలో 16 ప్లాట్‌ఫామ్‌లతో బస్ బే ఏర్పాట్లు చేస్తోంది. పుణ్యక్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండపైకి రవాణా వ్యవస్థను యాడా నేతృత్వంలో దేవస్థానం నిర్వహించనుంది. సుమారు ఏకరన్నర స్థలంలో ఈ పనులు చేపట్టగా బస్ బే, స్లాబ్ నిర్మాణాలు పూర్తయ్యాయి. బస్ స్టేషన్‌కి ఇరువైపులా, కొండకింద ప్రధాన రహదారి విస్తరణలో నష్టపోయిన యజమానులకు కేటాయించిన దుకాణాలను యాడా నిర్మిస్తోంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: