యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజు స్వామివారు హంసవాహనంపై బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్రాభరణాలు, రకరకాల పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు - యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజున లక్ష్మీనరసింహస్వామి హంస వాహనంపై ఊరేగారు. వజ్రాభరణాలంకరుడై... రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా భక్తులకు దర్శనమిచ్చారు.
YADADRI BRAHMOSTAVALU HELD IN A GRAND WAY
భక్తకోటిలోని అజ్ఞానం తొలగించి జ్ఞానప్రకాశం వెలిగించు తత్వమే హంస రూపంలోని పరమార్థమని అర్చకులు వివరించారు. ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య స్వరూపాన్ని దర్శించుకున్నారు.