తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులకు లక్ష్మీసమేత నరసింహుని దర్శనం - YADADRI BRAHMOSTAVALU 2020

లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజు... కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపుఉత్సవాలు నిర్వహించారు. లక్ష్మీసమేత నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు.

YADADRI BRAHMOSTAVALU HELD IN A GRAND WAY ON 10TH DAY
YADADRI BRAHMOSTAVALU HELD IN A GRAND WAY ON 10TH DAY

By

Published : Mar 7, 2020, 1:31 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 26న స్వస్తివాచనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు... అష్టోత్తర శతఘట్టాభిషేకం, డోలోత్సవంతో పరిసమాప్తి పలుకనున్నారు. ఉత్సవాల్లో భాగంగా పదోరోజున శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవం నిర్వహించారు. వజ్ర వైడూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన లక్ష్మీసమేత నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు.

వివిధ రకాల పుష్పాలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నయన మనోహరంగా శ్రీపుష్పయాగం నిర్వహించారు. దేవతోద్వాసనతో దేవతలందరినీ యథాస్థానాలకు పంపించే ప్రక్రియ నిర్వహించారు.

భక్తులకు లక్ష్మీసమేత నరసింహుని దర్శనం

ఇవీ చూడండి:మద్యం దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు

ABOUT THE AUTHOR

...view details