యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో భాజపా కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణితో కలసి భాజపా జిల్లా అధ్యక్షులు ఏవీ శ్యాంసుందర్ రావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వారు పరిశీలించారు.
రెండు పడక గదుల ఇళ్ల స్థలం ఎంపిక, నాణ్యత లేని పనుల వల్ల ఇళ్లు రెండేళ్లలోనే కృంగిపోయే ప్రమాదం ఉందని శ్యాంసుందర్ రావు ఆరోపించారు. దుబ్బాకలో భాజపా విజయంతో తెరాస పతనం ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ భాజపాదేనని తెలిపారు. సన్న ధాన్యాన్నికి మద్దతు దర చెల్లించని కేసీఆర్.. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను విమర్శించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
ఆత్మకూరులో భాజపా కార్యాలయం ప్రారంభం ఆలేరు నియోజకవర్గంలో తెరాస, కాంగ్రెస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతూ ఒకరిపై ఒకరు విమర్శించుకుని.. ఒక్కటయ్యారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదల భూములను ఆక్రమించుకున్న వారిపై పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశం, జిల్లా కార్యదర్శులు నరేందరం, మొగులయ్య నరేందర్ రావు, భాజపా పార్టీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి, నాయకులు తుమ్మల మురళీదర్ రెడ్డి, బి.అబ్బయ్య, బి.ఇంద్రారెడ్డి, ఎస్.బిక్షపతి, డి.కుమార్, జి.కాశీనాథ్, బి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఆరేళ్ల తర్వాత సీఎంకు నిరుద్యోగులు గుర్తొచ్చారా?: బండి సంజయ్