తెలంగాణ

telangana

స్వాతి నక్షత్రం పురస్కరించుకుని యాదాద్రిలో శతఘటాభిషేకం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయంలో శతకలశాలను ఏర్పాటు చేసి.. జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు, పెరుగుతో వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

By

Published : Jun 30, 2020, 11:51 AM IST

Published : Jun 30, 2020, 11:51 AM IST

yadadri bhuvangiri temple swathi pujalu conducted by priests
స్వాతి నక్షత్రం పురస్కరించుకుని యాదాద్రిలో శతఘటాభిషేకం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మంగళవారం నారసింహుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు, భక్తులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయంలో శతకలశాలలో ఏర్పాటు చేసిన జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు, పెరుగుతో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శతఘటాభిషేకం నిర్వహించారు.

స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులందరూ భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం లఘు దర్శనం ఏర్పాటు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details