తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టి అక్రమ రవాణా... నలుగురిపై కేసు - యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట అక్రమ మట్టి రవాణా

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమార్కులకు వరంగా మారింది. యాదగిరిగుట్ట పురపాలిక పరిధిలోని గుండ్లపల్లి వాగు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.

మట్టి అక్రమ రవాణా
మట్టి అక్రమ రవాణా

By

Published : Apr 18, 2020, 1:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని గుండ్లపల్లి వాగు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ట్రాక్టర్ల యజమాని గుండ్లపల్లి భరత్‌తో పాటు ముగ్గురు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు... ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details