తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకృతివనం, శ్మశానవాటికల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన - కొండపేట రైతుల నిరసన

తమ భూముల్లో అధికారులు అక్రమంగా శ్మశానవాటిక, ప్రకృతివనం నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కొండంపేటలోని బాధితులు మందుడబ్బాలతో నిరసన చేపట్టారు. వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.

yadadri bhuvanagiri district kondam peta farmers protest against the construction of palle prakruthi vanam and cemetery
ప్రకృతివనం, శ్మశానవాటికల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన

By

Published : Oct 1, 2020, 11:14 AM IST

అనుమతి లేకుండా తమ భూముల్లో అధికారులు శ్మశానవాటిక, ప్రకృతివనం నిర్మాణాలు చేపట్టారని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కొండంపేటలోని కొందరు రైతులు ఆరోపించారు. మందుడబ్బాలతో ఆందోళనకు దిగారు. వారికి కాంగ్రెస్​పార్టీ స్థానిక నాయకులు మద్దతుగా నిలిచారు.

వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని సర్వేనెంబరు 257 ప్రభుత్వ భూమిలో తాము గత కొన్ని సంత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని బాధితులు తెలిపారు. కాగా ప్రభుత్వ అధికారులు ఇప్పుడు తమ భూమిలో ప్రకృతి వనం, స్మశాన వాటిక నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించి తమ భూమిని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోలెబోయిన లింగయ్య యాదవ్, ఇటికాల చిరంజీవి, బాధితులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఫార్మాసిటీకి ఆటంకాలు.. ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

ABOUT THE AUTHOR

...view details