యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కుర్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 73 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా... వారిలో 26 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కాగా వారం కిందట కరోనా సోకిన మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ... సోమవారం మృతి చెందినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు.
జిల్లాలో కరోనా విజృంభణ.. భయాందోళనలో ప్రజలు - Yadadri bhuvanagiri District latest news
యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా విజృంభణతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మోత్కుర్ మండల పరిధిలో ఒక్కరోజే కొత్తగా 26 కొవిడ్ కేసులు నమోదు కాగా... ఇద్దరు మహమ్మారితో మృతి చెందారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడమే దీనికి కారణమని వైద్యాధికారులు తెలిపారు.
యాదాద్రి జిల్లా మోత్కుర్‌లో కరోనా విజృంభణ, యాదాద్రి జిల్లా తాజా వార్తలు
ప్రజలు నిబంధనలను పాటించక పోవడమే కరోనా వ్యాప్తికి కారణమవుతోందని ఆయన అన్నారు. ఇదే మరణాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా పాజిటివ్ అని తెలిసిన వారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందాలని... బయట తిరగడం వల్ల వైరస్ వ్యాప్తికి కారకులు అవుతున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: అ.ని.శా, విజిలెన్స్ చేతికి దేవరయంజాల్ భూముల విచారణ