తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ నెరవేర్చాలి' - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

యాదాద్రి అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో చేపడుతున్న రోడ్డు విస్తరణలో దుకాణాలు, ఇళ్లు కోల్పోతున్న బాధితులు, అధికారులతో... జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తమకు ఇచ్చిన హామీ ప్రకారం దుకాణాలు, ఇళ్లు నూతనంగా నిర్మించి ఇవ్వాలని బాధితులు కోరారు.

Yadadri Bhuvanagiri District Collector meeting with road widening victims in Yadadri
'తమకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీని నెరవేర్చాలి'

By

Published : Mar 2, 2021, 12:48 AM IST

యాదాద్రి అభివృద్ధికి తాము అడ్డుకాదని... యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో చేపడుతున్న రోడ్డు విస్తరణలో దుకాణాలు, ఇళ్లు కోల్పోతున్న బాధితులు అన్నారు. తమకు నష్ట పరిహారం ఇప్పుడు ఉన్న మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని కోరారు. బాధితులు, అధికారులతో కలెక్టర్​ అనితా రామచంద్రన్​ సమావేశం నిర్వహించి... రోడ్డు విస్తరణ అంశంపై చర్చించారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు తెలిపారు.

యాదగిరిగుట్ట బస్టాండ్​లో షాపింగ్ కాంప్లెక్స్​ను నిర్మించి తమకు దుకాణాలు ఇవ్వాలని భాదితులు అన్నారు. బస్టాండ్​ను తొలగించవద్దని... అది తొలగిస్తే తమ ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న స్థలంలో కూడా ప్రయాణికుల ప్రాంగణం ఉంటుందని కలెక్టర్​ తెలిపారు. గుండ్లపల్లి నుంచి పాతగుట్ట వరకు మొత్తం 80 ఫిట్ల వెడల్పుతో రోడ్డు వేసినట్లు ఆలయ ఈవో గీతా రెడ్డి తెలిపారు. అది ప్రస్తుతం సరిపోనందునే 150 ఫీట్లకు విస్తరించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం కేసీఆర్‌ సమావేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details