మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండ గంగపుత్రులు ఆరోపించారు. దానబోయిన కుంటను రైతులు ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీడీవో కార్యాలయంలో పలు వినతి పత్రాలు అందజేసినప్పటికీ... ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
కుంటలపై పూర్తి హక్కులు తమకే కల్పించాలి: గంగపుత్రులు - telangana news
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గంగపుత్రులు కోరారు. గ్రామాల్లోని పలు కుంటలను రైతులు ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేసినప్పటికీ... ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
![కుంటలపై పూర్తి హక్కులు తమకే కల్పించాలి: గంగపుత్రులు కుంటలపై పూర్తి హక్కులు తమకే కల్పించాలి: గంగపుత్రులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10803277-944-10803277-1614433297246.jpg)
yadadri Bhuvanagiri district Aleru Gangaputru urged the government to work for the economic growth of fishermen.
కుంటల విషయంలో గ్రామస్థులకు తమకు పలుమార్లు వివాదాలు ఎదురైనప్పటికీ... అధికారులు స్పందించలేదని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలపై పూర్తి హక్కులు తమకే కల్పించాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వంగాల సుధాకర్, వంగాల శ్రీనివాస్, రమేశ్, మధుసూదన్ బెస్త పాల్గొన్నారు.
కుంటలపై పూర్తి హక్కులు తమకే కల్పించాలి: గంగపుత్రులు
ఇదీ చదవండి:'చైనాను చూసి మోదీ భయపడుతున్నారు'
Last Updated : Mar 3, 2021, 7:07 AM IST