యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్(vaccination) సెంటర్ను జిల్లా అదనపు కలెక్టర్(Additional Collector) ఖీమ్యానాయక్ పరిశీలించారు. వ్యాక్సిన్ను అనుకున్న స్థాయిలో ఎందుకు వేయలేకపోయారని అధికారులను అడిగారు. వ్యాక్సిన్ ప్రక్రియలో అధికారులు అలసత్వం వహించకూడదని అన్నారు.
Additional Collector: వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించిన ఖీమ్యానాయక్
వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారులు అలసత్వంగా ఉండొద్దని యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్(Additional Collector) ఖీమ్యానాయక్ అన్నారు. మోత్కూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్(vaccination) సెంటర్ను పరిశీలించారు.
Additional Collector: వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించిన ఖీమ్యానాయక్
మోత్కూరు, అడ్డగుడూరు, గుండాల మండలాల్లో 391 మంది సూపర్ స్ప్రెడర్లకు 102 మంది టీకాను వేయించుకున్నారంటే అధికారుల పనితీరు అర్దమౌతుందని అన్నారు. టీకా వేసే విషయంలో సూపర్ స్ప్రెడర్లకు సమాచారం అందించడంలో అధికారులు విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 100మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇంత మంది సిబ్బంది అవసరం లేదని ఆగ్రహించారు.
ఇదీ చదవండి:Raghurama Case: ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు