జిల్లావ్యాప్తంగా సహకార సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని యాదాద్రి భువనగిరి డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఎసీఎస్) సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతులను ఆర్థికంగా బలపరిచేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సహకార బ్యాంకు సంఘాల్లో సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారన్నారు.
సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలి: డీసీసీబీ ఛైర్మన్ - గొంగిడి మహేందర్ రెడ్డి
సహకార సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని యాదాద్రి భువనగిరి డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలి: డీసీసీబీ ఛైర్మన్
బ్యాంకులను లాభాల బాటలో నడిపేందుకు ఎల్లప్పుడు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో వంగపల్లి సహకార సంఘానికి కోటి 82 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, వ్యవసాయ పరపతి సంఘం సభ్యులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.