యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి చెరువు కట్టకి శుక్రవారం మరమ్మతులు ప్రారంభించారు. ఈ పనులను జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ పరిశీలించారు. సోమవారం సాయంత్రం కట్ట ఓ చోట కుంగిపోవటం వల్ల ప్రమాదం పొంచివుందని భావించిన జిల్లా అధికారులు మరమ్మతులు చేపట్టారు.
చెరువు కట్ట మరమ్మతులు పరిశీలించిన కలెక్టర్ - యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారమచంద్రన్ పరిశీలన
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పెద్ద చెరువు కట్టకు చేపట్టిన మరమ్మతులను కలెక్టర్ అనితారామచంద్రన్ పరిశీలించారు. కట్ట కుంగిపోవడం వల్ల ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.
చెరువు కట్ట మరమ్మతులు పరిశీలించిన కలెక్టర్
చెరువు అలుగు పొసే రెండు చోట్ల గండి పెట్టి చెరువు కట్ట మీద నీటి ఒత్తిడి లేకుండా చేశారు. దీంతో సమీప కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. చెరువు వద్దకు వెళ్లకుండా రహదారికి ఇరువైపుల పోలీసుల పికెట్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:ఇది రైతులు, కాంగ్రెస్ పార్టీ విజయం: ఉత్తమ్
TAGGED:
inspection fond works