యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మూసీ వంతెనను, వరదలకు నీటమునిగిన వరి పంట పొలాలను జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండల వ్యాప్తంగా మూసీ నది పరీవాహక ప్రాంతాలను సందర్శించారు.
రైతులెవ్వరూ ఆందోళన చెందకండి: కలెక్టర్ అనితా రామచంద్రన్ - heavy floods to yadadri
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మూసీ పరీవాహక ప్రాంతాల్లో కలెక్టర్ అనితారామచంద్రన్ పర్యటించారు. నీట మునిగిన పంట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.

yadadri bhuvanagiri collector anitha ramachandran visited in valigonda
నీటి మునిగిన పంట వివరాలను ఎమ్మార్వో నాగలక్ష్మి, వలిగొండ మండల వ్యవసాయ అధికారి అంజనీదేవిని కలెక్టర్ అనిత రామచంద్రన్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వివిధ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్... రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.