యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడం వల్ల భారీగా తరలిరావటంతో సందడి నెలకొంది. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా లఘు దర్శన సౌకర్యం మాత్రమే కల్పించారు. స్వామివారి ధర్మ దర్శనానికి దాదాపు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట నుంచి గంటన్నర వరకు సమయం పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం - యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
ఆదివారం కావటం వల్ల యాదాద్రి పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ వీధులు, పట్టణ రహదారులు కోలాహలంగా మారాయి.
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం