తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri temple: 'నష్టపరిహారం కింద ఇల్లు, దుకాణం ఇప్పించండి' - యాదాద్రి రహదారి విస్తరణ బాధితుల వేడుకోలు

పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసిన తమని వీధిన పడేయొద్దని అంజనాపురి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి విస్తరణ బాధితుల తరహాలోనే తమకూ నష్ట పరిహారం చెల్లించాలని కలెక్టర్ పమేళా సత్పతిని కోరారు.

yadadri anjanapuri colony people protest
నష్టపరిహారం కింద ఇల్లు, దుకాణం ఇప్పించండి

By

Published : Jun 19, 2021, 5:56 PM IST

యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసిన తమని వీధిన పడేయొద్దని అంజనాపురి కాలనీవాసులు వేడుకుంటున్నారు. యాదాద్రి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా అంజనాపురి కాలనీ ప్రాంతాన్ని యాడా స్వాధీనం చేసుకోనుంది. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని ఇటీవల పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్ పమేలా సత్పతితో గృహ బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో సైదాపురం 314 సర్వే నంబరులో నివాస స్థలం ఇప్పిస్తామని అధికారులు చెప్పారని, నేటికీ సర్వే చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని బాధితులు వాపోయారు.

గజానికి రూ.12 వేల చొప్పున ఇచ్చి ప్రధాన రహదారి విస్తరణ బాధితులు తరహాలో తమకూ నష్టపరిహారం, దుకాణం కల్పించాలని కోరారు. అందులో భాగంగానే యాదగిరిగుట్ట ప్రధాన రహదారిలో రాకపోకల బంద్ చేపట్టారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మార్కింగ్ చేసిన ప్రాంతాల్లోని ఇల్లు దుకాణాలను ఇప్పటికే నేలమట్టం చేశారు.

ఇదీ చూడండి:పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details