తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీనివాస్​ను ఉరితీయాలి..హాజీపూర్ వాసుల ఆందోళన - srinivas

హాజీపూర్ గ్రామస్థులు ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్​ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

హాజీపూర్ వాసుల ఆందోళన

By

Published : May 17, 2019, 12:43 PM IST

Updated : May 17, 2019, 3:38 PM IST

హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో హాజీపూర్ గ్రామస్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది భీష్మించి కూర్చున్నారు. దీక్షలో పాల్గొన్న గ్రామస్థులకు పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు, కాంగ్రెస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు.

హాజీపూర్ వాసుల ఆందోళన
నిందితుడు శ్రీనివాస్ రెడ్డి విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తుందని కల్లూరి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కస్టడీ, రిమాండ్ పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. సైకోని వెంటనే ఉరి తీసి, బాధిత కుటుంబాలకు 50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను సంఘటితం చేసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
Last Updated : May 17, 2019, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details