యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, యాడ అధికారులతో కలిసి ఆలయ పనులను నిశితంగా పరిశీలించారు. ప్రధాన ఆలయం వద్ద చేపడుతున్న ఫ్లోరింగ్ పనులు, ప్రధాన ఆలయంలో చేపడుతున్న తుదిదశ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోకి వర్షం నీరు రాకుండా చేపడుతున్న లీకేజీ మరమ్మతులు, ప్రాకార మండపాల్లో శిల్పాల తుదిమెరుగుల పనులను, భూగర్భ డ్రైనేజీ (మురుగునీరు పారుదల) ప్రధానాలయం పడమరవైపు వేంచేపు మండపం వద్ద చేపట్టిన ఫ్లోరింగ్ మరమ్మతు పనులను తెలుసుకున్నారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన యాడ అధికారులు - ఆలయ ఈవో గీతారెడ్డి
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, యాడ అధికారులతో కలిసి ఆలయ పనులను నిశితంగా పరిశీలించారు. ప్రధాన ఆలయం వద్ద చేపడుతున్న ఫ్లోరింగ్ పనులను, ప్రధాన ఆలయంలో చేపడుతున్న తుదిదశ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన యాడ అధికారులు
ఘాట్ రోడ్డులో చేపడుతున్న ఫౌంటెన్ నిర్మాణ పనులను ప్రధానాలయ అంతర్ ప్రాకార సాలహారాల్లో దేవతామూర్తుల రాతి విగ్రహాల బిగింపు పనులను కొండపైన నిర్మాణం జరుగుతున్న పుష్కరిణి, శివాలయంలో తుది మెరుగు పనుల దగ్గరుండి పర్యవేక్షించారు. కొండ కింద చేపడుతున్న రోడ్డు మరమ్మతు పనులను, కొండపైన చేపడుతున్న రక్షణ గోడ, (రిటైనింగ్ వాల్) కొండపైన నిర్మాణం చేపడుతున్న ఈవో కార్యాలయం పనుల వివరాలు అధికారులను ఆడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:సిద్ధమైన రైతువేదికలు... రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం