తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో రెండతస్తుల అన్న ప్రసాద భవనం

యాదాద్రి పుణ్య క్షేత్రంలో నిత్యాన్న ప్రసాద సముదాయ భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు యాడా తెలిపింది. హారేరామ హరేకృష్ణకు చెందిన అక్షయపాత్ర వారి సూచనలతో సదరు సముదాయం ఏర్పాటవుతున్నట్లు వెల్లడించింది.

Yada said plans are afoot to build a Nithyanna Prasada complex at the Yadadri shrine.
యాదాద్రిలో.. రెండతస్తుల సముదాయంగా ప్రసాద భవనం

By

Published : Jan 31, 2021, 7:46 AM IST

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా నిత్యాన్న ప్రసాద సముదాయ భవన నిర్మాణానికి నమూనా సిద్ధమైనట్లు యాడా తెలిపింది. హారేరామ హరేకృష్ణకు చెందిన అక్షయపాత్ర వారి సూచనలతో సదరు సముదాయం ఏర్పాటవుతున్నట్లు వివరించింది.

అక్షయపాత్ర వారి సూచనలతో...

కొండకింద రూ.6.50 కోట్ల వ్యయంతో రెండతస్తుల సముదాయంగా నిర్మిస్తున్నారు. ఆర్ అండ్ బీ శాఖ పర్యవేక్షణలో.. కొండదిగువన గండిచెరువు సరిహద్దుల్లోనే ఏర్పాటయ్యే ఈ సముదాయంలో ఒకేసారి 720 మంది భక్తులు అన్న ప్రసాదం పొందే అవకాశం ఉంటుంది. హారేరామ హరేకృష్ణ కు చెందిన అక్షయపాత్ర వారి సూచనలతో సదరు సముదాయం ఏర్పాటవుతోంది.

ఇదీ చదవండి:అన్నదాతల ఆందోళనలో ఏకమైన జాట్‌లు

ABOUT THE AUTHOR

...view details