తెలంగాణ

telangana

ETV Bharat / state

చెన్నైలో స్వర్ణ తాపడం పనులు పరిశీలించిన యాడా - yadadri lakshmi narasimha swamy temple

స్వయంభు క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రిని మాహాదివ్య క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు యాడా అధికారులు నడుం బిగించారు. చెన్నైలోని స్మార్ట్​ క్రియేషన్స్​ ఇండస్ట్రీలో స్వర్ణ తాపడం పనులు చేపట్టారు.

yada officers visit chennai to inspect yadadri temple's gold work
చెన్నైలో స్వర్ణ తాపడం పనులు పరిశీలించిన యాడా

By

Published : Dec 21, 2019, 4:42 PM IST

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రాజగోపురాలపై కళశాలు, దివ్యవిమానంపై సుదర్శన చక్రం, ప్రధానాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠాల తొడుగులకు స్వర్ణ తాపడం పనులను యాడా అధికారులు చెన్నైలో చేపట్టారు.

అక్కడి స్మార్ట్​ క్రియేషన్స్​ ఇండస్ట్రీలో చేపడుతున్న బంగారు పనులను పరిశీలించేందుకు యాడా బృందం చెన్నై వెళ్లింది. మూలవర్యులకు సైతం తాపడం చేపట్టాలని, గతంలో ఉన్న బంగారు తొడుగులకు మెరుగులు దిద్దాలని యాడా యోచిస్తోంది.

చెన్నైలో స్వర్ణ తాపడం పనులు పరిశీలించిన యాడా

ABOUT THE AUTHOR

...view details