యాదాద్రి పుణ్యక్షేత్రంలో యాడా అతిథి గృహాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. పెద్దగుట్టపై రూ.3.5 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టారు. 549 చ.మీ. స్థలంలో కుటీరంలా అతిథిగృహ సముదాయం ఏర్పాటు చేస్తున్నారు.
శరవేగంగా యాడా అతిథి గృహం నిర్మాణం - తెలంగాణ వార్తలు
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో యాడా అతిథి గృహాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. రూ.3.5 కోట్లతో దీనిని రూపొందిస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
![శరవేగంగా యాడా అతిథి గృహం నిర్మాణం yadadri guest house, yada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:09:27:1623371967-tg-nlg-87-10-yadadri-ytda-gest-houses-av-ts10134-10062021233358-1006f-1623348238-263.jpg)
యాదాద్రి, యాడా అతిథి గృహం
ఈ అతిథి గృహంలో నాలుగు పడక గదులు, హాల్, ఆఫీసుతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు సంబంధిత ఆర్అండ్బీ శాఖ డీఈ మణి బాబు తెలిపారు. ఆ అతిథిగృహం ప్రాంగణం నుంచి యాదాద్రి క్షేత్ర పరిసరాలను చూడొచ్చు.
ఇదీ చదవండి:Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు