తెలంగాణ

telangana

ETV Bharat / state

తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి - man died

తాటిచెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గోకారం గ్రామంలో చోటుచేసుకుంది. గీతకార్మికుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

worker died after falling from palm tree in yadadri bhuvanagiri district
తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి

By

Published : Jun 23, 2020, 5:50 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోకారంలో ఈరోజు ఉదయం తాటి చెట్టుపై నుంచి పడి కల్లు గీత కార్మికుడు మృతి చెందాడు. మృతుడు కంచర్ల ముత్తులుగా గుర్తించారు. ఈరోజు ఉదయం రోజూ మాదిరిగానే కల్లు గీయటానికి వెళ్లి పట్టు జారీ కిందపడ్డట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

గీత కార్మికుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మంత్రి గన్​మెన్ వీరంగం

ABOUT THE AUTHOR

...view details