జీవం పోసుకున్న శిల్పాలు.. ఆధ్యాత్మికత నింపుకున్న చిత్రాలు యాదాద్రిలో భక్తులను కళాసాగరంలోకి తీసుకెళ్లనున్నాయి. ఆలయం నలుమూలలా ఆధ్యాత్మికత.. మానసిక ఉత్తేజం కలిగించేలా శిల్పాలు, చిత్రాలను యాడ ఏర్పాటు చేయిస్తోంది.
టేకు చెక్కపై నారసింహుడు.. యాదాద్రిలో శిల్పకళలు - యాదాద్రిలో సీఎం మెచ్చిన చిత్రం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఎటు చూసినా కళావైభవం ఉట్టి పడుతోంది. ఏ చిత్రాన్ని చూసినా భక్తి భావం ఉట్టిపడేలా.. చూపులను కట్టిపడేస్తున్నాయి. టేకు చెక్కపై చెక్కిన లక్ష్మీనరసింహస్వామి చిత్రం ముఖ్యమంత్రి పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టేకు మానుపై స్వామివారు.. చూసిన వారు పెడతారు దండాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో సికింద్రాబాద్ అన్నపూర్ణ టింబర్ వర్క్స్‌కు చెందిన దారు శిల్పి... లక్ష్మీనరసింహస్వామి, ప్రహ్లాదుడు, దేవతలతో కూడిన చిత్రాన్ని టేకు చెక్కపై ఆవిష్కరించారు. స్థపతి ఆనందాచారి వేలు పర్యవేక్షణలో తీర్చిదిద్దిన ఆదారుశిల్పాన్ని సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శిల్పి నైపుణ్యాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు.
ఇదీ చూడండి:విద్యుద్దీపాల వెలుగులో రాజన్న ఆలయం