తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానం, వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు - యాదాద్రి జిల్లా బొమ్మల రామారం

భార్యాభర్తలిద్దరి మధ్య అనుమానం గెలిచింది. అక్రమ సంబంధం ఉందంటూ ఒకరినొకరు నిందించుకున్నారు. గొడవ తారాస్థాయికి చేరి.. భార్య వంటగదిలో ఫ్యాన్​కు ఉరేసుకొని చనిపోయింది.

అనుమానం, వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు
అనుమానం, వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు

By

Published : Dec 21, 2019, 4:26 PM IST

Updated : Dec 21, 2019, 5:20 PM IST

అనుమానం గెలిచింది.. భార్య ఉరివేసుకుందా..?
యాదాద్రి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన రాజేశ్వరి (28)కి 2009 సంవత్సరంలో జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్​కు చెందిన వెంకటేశ్​తో వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ బార్లో వెంకటేశ్​ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత మూడేళ్లుగా వెంకటేశ్​ ఇతర మహిళతో.. అలాగే రాజేశ్వరి కూడా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు.

ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ అక్రమ సంబంధం విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వారని.. నిన్న రాత్రి వీరి మధ్య గొడవ తారస్థాయికి చేరిందన్నారు. ఇవాళ ఉదయం భర్త నిద్రలేచి చూసేసరికి భార్య రాజేశ్వరి వంట గదిలో ఫ్యాన్​కు చున్నీతో ఉరేసుకొని కనిపించింది. కిందకి దింపి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలి బంధువులు మాత్రం రాజేశ్వరిని ఆమె భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు.

Last Updated : Dec 21, 2019, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details