యాదాద్రి భువనగిరిలోని ఆర్బీ నగర్లో నివసిస్తోన్న ముత్యాల భారతి అనే మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. భారతి మానసిక స్థితి బాగా లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పుడూ తన వద్ద ఎవరో ఒకరు ఉండే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. తను చెప్పిన మాట కుమారులు వినట్లేదని బెంగ పడేదని, చిన్న విషయాలకు కూడా ఆందోళనకు గురయ్యేదని బంధువులు పేర్కొన్నారు. మృతురాలి భర్త రాజు ఆత్మకూరు మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నారు. ముగ్గురు పిల్లల్లో ఒకరు డిగ్రీ, మరో ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. మృతురాలికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని బంధువులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మానసిక స్థితి సరిగ్గా లేక మహిళ ఆత్మహత్య
మానసిక స్థితి సరిగ్గా లేక ఓ మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని పోలీసులకు బంధువులు తెలిపారు.
మానసిక స్థితి సరిగా లేక మహిళ ఆత్మహత్య