కరోనా నివారణకు యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బొమ్మలరామారం మండలం గోవింద్తండాకు చెందిన నలుగురు వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. తండాకు చెందిన గర్భిణీని ఈ నెల 22న చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. తిరుగుప్రయాణంలో 102 వాహనంలో ఇంటికి తీసుకువచ్చారు.
ప్రభుత్వ క్వారంటైన్‌కు మహిళ తరలింపు - అంబులెన్స్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్
యాదాద్రి భవనగిరి జిల్లా గోవింద్తండాకు చెందిన ఓ మహిళను ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రభుత్వ క్వారంటైన్‌కు మహిళ తరలింపు
సంబంధిత అంబులెన్స్ డ్రైవర్‌కు నిన్న కరోనా పాజిటివ్ వచ్చింది. వాహనంలో ప్రయాణించిన వారికి పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. మండల ప్రజలెవరూ కరోనా విషయంలో ఆందోళనకు గురికావద్దని ఎస్సై మధుబాబు సూచించారు. లాక్డౌన్లో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించాలన్నారు.
ఇదీ చూడండి:ఇర్ఫాన్‌ఖాన్‌కు సైకత శిల్పంతో ఘననివాళి