యాదాద్రి జిల్లా రామన్నపేట సర్పంచ్ శిరీషా పృథ్వీరాజ్ వినూత్న రితీలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ లెక్కచేయకుండా, మాస్కులు లేకుండా తిరుగుతున్న ప్రజలకు గులాబీ, బంతిపూలు ఇచ్చి అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరు మాస్క్ ధరించాలని వేడుకున్నారామె. ఇప్పటివరకు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషకరమన్నారు. మనం చేసే చిన్న తప్పిదం వల్లే.. వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
గులాబీ పూలతో మహిళా సర్పంచ్ వినూత్న అవగాహన - యాదాద్రి జిల్లా వార్తలు
ప్రజలకు అవగాహన కల్పించడంలో యాదాద్రి జిల్లా రామన్నపేట సర్పంచ్ శిరీషా పృథ్వీరాజ్ ముందుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే వాల్ పెయింటింగ్ ఏర్పాటు చేసి అందరిని ఆలోచింపజేయగా.. తాజాగా గులాబీలు, బంతిపువ్వులు పంచుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషకరమన్నారు
పూలతో మహిళా సర్పంచ్ వినూత్న అవగాహన
కరోనాపై అవగాహన కల్పించేందుకు కొద్ది రోజుల క్రితమే వాల్ పెయింటింగ్ ఏర్పాటు చేసి అందరిని ఆలోచింపచేశారు. తనవంతు సాయంగా నిరుపేదలకు, గర్భిణీలకు నిత్యావసరాలు, పౌష్ఠికాహారం అందజేశారు.
ఇదీ చదవండి:3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. !