యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలం ముత్తిరెడ్డి గూడెం సర్పంచ్ ఆడెపు విజయను అదే గ్రామానికి చెందిన శశిధర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అవమానపరిచారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. కేసు నమోదైనా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఈ ధర్నాలో దళిత నాయకులు, కార్యకర్తలు, ఐద్వా నాయకులు పాల్గొన్నారు.
తనను అవమానించిన నిందితులపై గతనెలలో మోటకొండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని.. జులై 4 న ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని, 6వ తారీఖున ఏసీపీ గ్రామంలో విచారణ చేశారని, 9 మంది సాక్ష్యం కూడా చెప్పారని.. అయినా పోలీసులు వారి మీద చర్యలు తీసుకోవడం లేదని సర్పంచ్ ఆడెపు విజయ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదై 15 రోజులవుతున్నా ఇప్పటివరకు నిందితుడు శశిధర్ రెడ్డిని అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ, ఆమె దళిత సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.