తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మహిళ మృతి - bhongir hospital

ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళకు ఆసుపత్రిలో సరైన వైద్యం అందక మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.

జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మహిళ మృతి

By

Published : Jul 18, 2019, 1:36 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన జక్కల పద్మ భర్తతో గొడవపడి... క్షణికావేశంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా... వైద్యుడు పరీక్షించి ఇబ్బందేమీ లేదని చెప్పాడు. ఈరోజు తెల్లవారుజామున ఆమె ప్రాణాలు కోల్పోయింది. పద్మ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details