యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తుర్కపల్లి వైపు వెళ్తుండగా... మల్కాపూర్ గ్రామ శివారులో ద్విచక్రవాహనంపై నుంచి ప్రమాదవశాత్తు ఎగిరి పడి ఓర్సు మమత అనే మహిళ మృతి చెందింది.
ద్విచక్రవాహనంపై నుంచి పడి మహిళ మృతి - bike incident at malkapur
ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడి ఓ మహిళ మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపూర్‌కు చెందిన మహిళగా గుర్తించారు.
ద్విచక్రవాహనంపై నుంచి పడి మహిళ మృతి
స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా... అక్కడికి చేరుకున్న సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి