Woman Protest on Road For her husband :వివాహేతర సంబంధాలతో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. నమ్మి వచ్చిన జీవిత భాగస్వామిని నడిరోడ్డున నిలబెడుతున్న ఘటనలు నిత్యం ఎన్నో చూస్తున్నాం.వివాహేతర సంబంధాలు దంపతుల మధ్య బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. మూడు ముళ్ల బంధానికి కట్టుబడలేక.. అడ్డదారులు తొక్కుతూ.. ఆ తర్వాత తప్పులు చేస్తూ.. తమ జీవితాలనే కాకుండా పక్కవారి జీవితాలనూ అంధకారంలోకి నెట్టేస్తున్నారు.
Woman suicide attempt in yadadri : కాబోయే జీవిత భాగస్వామిపై కోటి ఆశలు పెట్టుకుంది. అన్నీ తానే అనుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది ఆ యువతి. తనను పెంచిన వారి నుంచి పొందిన ప్రేమనురాగాలను తన భర్తకు పంచాలనుకుంది. అనుకున్నట్టుగానే పెళ్లి తర్వాత చాలా ఆనందంగా సాగింది వారి జీవితం. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. ఇంతలో ఏమైందో కానీ.. ఆమె భర్త దృష్టి మరో మహిళపై పడింది. దాంతో భార్యను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. మరో మహిళకు దగ్గరై.. వివాహేతర సంబంధానికి తెరలేపాడు. ఇద్దరు పిల్లలు ఉన్న విషయం పక్కనబెట్టి.. మానవ సంబంధాలను మంట కలిపి.. ఏకంగా ఆ యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. నువ్వు అందంగా లేవు.. అందుకే మరో మహిళతో కలిసి జీవించాలనుకుంటున్నానని సమాధానం ఇచ్చాడు.
Woman Protesting on Road in Yadadri :యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు, బాధితురాలి కథనం ప్రకారం.. ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పన్నీరు రాజేశ్‌కు, పన్నీరు పూజతో ఏడేళ్ల కిత్రం వివాహం జరిగింది. ఈ దంపతులకు యక్షశ్రీ (6), హారిక (4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
భార్య అందంగా లేదని.. మరో యువతితో..:భార్య అందంగా లేదని భర్త గత ఏడాది మరో మహిళతోవివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పూజ.. పిల్లలు, అత్తామామతో కలిసి ఇంట్లోనే ఉంటోంది. కుమారుడికి బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులే అతడికి వత్తాసు పలుకుతూ.. కన్న కుతురిలా చూసుకోవాల్సిన కోడలిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అక్కలా తోడుండాల్సిన ఆడబిడ్డ సైతం వేధింపులకు గురి చేసింది. అయినా.. భర్త కోసం అవన్నీ భరించింది. ఈ క్రమంలోనే ఇటీవల రాజేశ్ తిరిగి ఇంటికొచ్చాడు. మరో మహిళతో కలిసి సోమవారం నాడు ముత్తిరెడ్డిగూడెంలోని తన ఇంటికి చేరుకున్నాడు. భర్త పక్కన మరో యువతిని చూసిన భార్య నిలదీసింది. 'నువ్వు అందంగా లేవు.. అందుకే నేను ఈమెతో కలిసి బతకాలనుకుంటున్నా'' అని అక్కడి నుంచి సమాధానం వచ్చింది. ఏం చేయాలో తెలియని బాధితురాలు.. తన భర్త తనకు కావాలంటూ రోడ్డెక్కింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఆమెను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధితురాలితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: