యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కింద పడి గంగాభవాని(18) అనే యువతి తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భవాని చౌటుప్పల్లోని జియో ఫాస్ట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్క బావ వద్ద చౌటుప్పల్లో ఉంటోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండవ అంతస్తు నుంచి కిందపడి యువతి మృతి - yuvathi mruthi
ప్రమాదవశాత్తు రెండవ అంతస్తు నుంచి కిందపడి ఓ యువతి మృతి చెందిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో చోటు చేసుకుంది.
రెండవ అంతస్తు నుంచి కిందపడి యువతి మృతి