యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో ఓ మద్యం దుకాణం నిర్వాహకులు.. లాక్‌డౌన్ సమయంలో మద్యంతో సొమ్ము చేసుకునేందుకు యత్నించారు. అర్థరాత్రి షాపు తెరిచి ఆటోలో మద్యం తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
మద్యం తరలింపునకు యత్నించిన వ్యక్తుల అరెస్ట్ - వంగపల్లిలో మద్యం తరలింపునకు యత్నించిన వ్యక్తుల అరెస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వైన్ షాపు తెరిచి మద్యాన్ని తరలిస్తూ కొందరు పోలీసులకు పట్టుబడ్డారు. మద్యం దుకాణాన్ని సీజ్ చేసి.. నిర్వహకులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

మద్యం తరలింపునకు యత్నించిన వ్యక్తుల అరెస్ట్
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిర్వాహకులను పట్టుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్నందుకు నిర్వాహకులపై ఎపిడమిక్ డిసీసెస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా ఎస్పీ కృష్ణప్రియ తెలిపారు.
మద్యం తరలింపునకు యత్నించిన వ్యక్తుల అరెస్ట్
ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక
TAGGED:
వంగపల్లిలో మద్యం దుకాణం సీజ్