తెలంగాణ

telangana

ETV Bharat / state

బూర నర్సయ్యగౌడ్ సతీమణి అనిత ఇంటింటి ప్రచారం - TRS CAMPAIGN

అభ్యర్థుల తరపున భార్యల ప్రచారం కూడా జోరందుకుంది. భువనగిరి స్థానం నుంచి బరిలో ఉన్న అధికార పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తరపున ఆయన సతీమణి అనిత ఇంటింటి ప్రచారం చేపట్టారు.

కారు గుర్తుకే ఓటేయాలి : అనిత బూర నర్సయ్య గౌడ్

By

Published : Mar 29, 2019, 1:26 PM IST

ఇంటింటి ప్రచారం నిర్వహించిన బూర నర్సయ్య గౌడ్ సతీమణి అనిత
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణాపురం మండల కేంద్రంలో తెరాస అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సతీమణి అనిత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెరాసకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజా స్పందన చూసి... ఈసారి గత ఎన్నికల కంటే అత్యధిక మెజారిటీ వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.16 స్థానాల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంపై గట్టి పట్టు ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ప్రజలు కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి :గాంధీభవన్​లో కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ


ABOUT THE AUTHOR

...view details